ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం చేస్తున్నప్పటికీ… రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ నేత పురందేశ్వరి మండిపడ్డారు. తమకు మీడియా కూడా సహకరించడం లేదని… అందువల్ల తామే క్షేత్రస్థాయికి వెళ్లి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని మేధావులకు, ప్రజలకు వివరిస్తామని చెప్పారు.ఎయిమ్స్ నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అంటున్నారని… త్వరలోనే ఎయిమ్స్ నిర్మాణం పూర్తికానుందని అన్నారు. జనవరి నుంచి ఎయిమ్స్ లో ఓపీ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెరగకపోయినా… ముంపు ప్రాంతం పెరిగిందనే సాకు చూపుతూ, నష్ట పరిహారం చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు అడుగుతోందని మండిపడ్డారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments