పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ వ్యక్తిగత కార్యదర్శి పీఏనంటూ ప్రచారం చేసుకుని మైసూరు ప్రాంతంలో లక్షలాది రూపాయలు వసూళ్లకు పాల్పడిన బణ్ణూరు రవిపై గురువారం కేసు నమోదైంది. పునీత్ పీఏనంటూ ప్రచారం చేసుకుని ప్రముఖుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో చెల్లి పెళ్లి ఆడంబరంగా ముగించి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మైసూరు జిల్లా టి.నరసీపుర నియోజకవర్గం బణ్ణూరులో రవి 20 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఇటీవలే మైసూరుకు వెళ్లి పునీత్‌రాజ్‌కుమార్ ఏపీగా కొనసాగుతున్నానని, సినిమాలలో ఛాన్స్‌లు ఇప్పిస్తానని పునీత్ సినిమాలలో రోల్స్ గ్యారంటీ అంటూ ప్రచారం చేసుకుని, చెల్లి పెళ్లి ఉందని డబ్బులు సర్దుబాటు చేయాలని, పలువురి నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవలే కొందరు రవి కోసం ప్రయత్నిస్తుండగా ఫోన్ స్విచ్ఛాఫ్ కాగా ఎక్కడా ఆచూకీ లేకుండా పోయాడు. ఈమేరకు బణ్ణూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పవన్ పీఏనని దారుణంగా మోసం
Subscribe
Login
0 Comments