హైపర్ ఆది చిత్రానికి పవన్

628

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరమై , తాను స్థాపించిన జనసేన పార్టీ లో నిమగ్నం అయ్యాడు. అయినప్పటికీ అప్పుడప్పుడు సినిమా వేడుకలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా హైపర్ ఆది చిత్రానికి పవన్ సాయం చేయబోతున్నారు .

‘ఆ నలుగురు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చంద్ర సిద్ధార్థ తాజాగా ‘ఆటగదరా శివ’ చిత్రాన్ని తెరకెక్కించారు. దోడన్న, ఉదయ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఆ మధ్య మొదటి పాట విడుదల కాగా.. తాజాగా రెండో సాంగ్‌ విడుదల కాబోతుంది. ఎట్టాగయ్య శివ అంటూ సాగే ఈ పాటను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించగా.. వాసుకి వైభవ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here