జిల్లా కాంగ్రెస్‌లో పాత నీరు చేరుతోంది. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు వ్యతిరేకించారు. ఆ తర్వాత పలువురు నేతలు పార్టీని వీడారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పార్టీని వీడిన వారు తిరిగి రావాలని అధిష్ఠానం ఆహ్వానించడంతో పాత కేడర్‌ తిరిగి సొంత గూటికి చేరేందుకు సమాయత్తమవుతోంది. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు నిర్వర్తించిన జిల్లా కాంగ్రెస్‌ నేత కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరడంతో జిల్లా కేడర్‌లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆయనను అనుసరించి పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూకడుతున్నారు. కిరణ్‌కుమార్‌ను రాజకీయ గురువుగా భావించే నవీన్‌కుమార్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌ ఊమెన్‌చాందీ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments