1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు… ‘తెలుగుదేశం సూపర్ హిట్’ అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిందని ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇప్పడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్నా క్యాంటీన్ల’ గురించి జాతీయ పత్రికలన్నీ అదే రీతిలో కథనాలను ప్రచురించాయని తెలిపారు. ‘అన్నా క్యాంటీన్స్ సూపర్ హిట్’ అంటూ నిన్న అన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రాబాబు చేస్తున్న కృషికి ఇదే నిదర్శనమని చెప్పారు. దీనికి తోడుగా మనీ కంట్రోల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఐబీటీ, బిజినెస్ట్ స్టాండర్డ్, ఏఎన్ఐ, డెక్కన్ క్రానికల్ తదితర పత్రికలతో పాటు ఓ తమిళ పత్రికల్లో వచ్చిన కథనాలకు సంబంధించిన పేపర్ కటింగ్ లను ఆయన అప్ లోడ్ చేశారు.
తెలుగుదేశం సూపర్ హిట్
Subscribe
Login
0 Comments