టాలీవుడ్ లో ‘ఎస్ఎంఎస్’ తో హీరోగా పరిచయం అయిన సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు తర్వాత మారితి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ హిట్ కాలేదు. ఆ మద్య బాలీవుడ్ లో బాగీ సినిమాలో విలన్ గా నటించాడు..కానీ అక్కడ కూడా ఏదీ కలిసి రాలేదు. ఈ మద్య ‘సమ్మోహనం’ సినిమాతో మంచి విజయం అందుకున్న సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మరో ఆసక్తికర చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ సుధీర్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాను సుధీర్‌ బాబు తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా స్టీలర్‌ పేరుతో రిలీజ్‌ చేశారు. ఈ సినిమా టీజర్(శనివారం) విడుదలైంది. ”ఆఫీసుకి రావాలంటే ప్రతిరోజూ భయంతో చచ్చిపోతున్నాం సార్. మరీ దారుణంగా సెక్యూరిటీతో గెంటించేస్తున్నారు” అనే డైలాగ్స్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments