ఇకపై ప్రతి యేటా రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు నూజివీడులో నిర్వహించిన ‘వనం-మనం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 26 శాతం పచ్చదనం మాత్రమే ఉందని… 2029 నాటికి 50 శాతం పచ్చదనాన్ని పెంచుదామని చెప్పారు. ఈ ఒక్క రోజు కోటి మొక్కలు నాటామని… ఈ ఏడాదిలో 25 కోట్ల మొక్కలు నాటుదామని తెలిపారు. వనం-మనం కార్యక్రమం సందర్భంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో చంద్రబాబు మొక్కలు నాటారు. చెట్లను కాపాడతామంటూ విద్యార్థుల చేత ప్రమాణ చేయించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments