టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

580

ఇంగ్లండ్‌పై మొదటి వన్డే గెలిచిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా ఈరోజు రెండో వన్డే ఆడుతోంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. లండన్‌లోని లార్డ్స్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. భారత జట్టులో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, లోకేశ్ రాహుల్‌, సురేశ్‌ రైనా, మహేంద్ర సింగ్‌ ధోనీ, హార్దిక్ పాండ్యా, సిద్ధార్థ్‌ కౌల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఉమేష్‌ యాదవ్‌, యజువేంద్ర ఛాహెల్‌ ఉన్నారు. ఎటువంటి మార్పులూ లేకుండా టీమిండియా బరిలోకి దిగింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే కూడా గెలిస్తే సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here