అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, క్వీన్‌ ఎలిజెబెత్‌-2లు ఆందోళనల మధ్య శుక్రవారం మొదటిసారి సమావేశమయ్యారు. రాజవంశానికి చెందిన విండ్సర్‌ క్యాసిల్‌ కోటలో నిర్వహించిన తేనీటి విందులో ట్రంప్‌ పాల్గొన్నారు. బ్రిటన్‌ ప్రోటోకాల్‌ ప్రకారం రాణి ఎదుట తల వంచాలి. కాని ట్రంప్‌, ఆయన భార్య మెలానియా ట్రంప్‌ తలను వంచలేదు. అంతేకాకుండా ట్రంప్‌ విండ్సర్‌ క్యాసిల్‌కు నిర్ణీత సమయానికి రాకపోవడంతో 92ఏళ్ల ఎలిజెబెత్‌ రాణి వారిని ఆహ్వానించేందుకు వేచివున్నారు. అలాగే ట్రంప్‌ సైనికుల గౌరవ వందనం స్వీకరించే సమయంలోనూ ఆమె కంటే ముందు నడిచారు. ప్రొటోకాల్‌ ప్రకారం రాణికి ముందుగా నడవకూడదు. రాణి పట్ల ట్రంప్‌ ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై బ్రిటన్‌ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌పై ఆగ్రహంతో అనేకమంది ట్వీట్స్‌ చేస్తున్నారు.కాగా, ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన అనంతరం స్కాంట్లాండ్‌కు వెళ్లారు. ట్రంప్‌ తల్లి స్కాట్లాండ్‌కు చెందిన వ్యక్తి కావడంతో ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆదేశానికి చేరుకున్నారు. ఈ వారాంతాన్ని ఆయన ఐర్‌షైర్‌లోని తన టర్న్‌బెర్రీ గోల్ఫ్‌ రిసార్ట్‌లో గడపనున్నారు. అయితే ట్రంప్‌ స్కాట్లాండ్‌కు రావడంపై గ్లాస్గోలో ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments