తిరుమల వెంకన్నకు ఎన్నారై భక్తులు భూరి విరాళాన్ని సమర్పించారు. ఏపీకి చెందిన రవి, శ్రీనివాస్ కలిసి స్వామివారికి రూ.13కోట్లకుపైగా విరాళాన్ని ఇచ్చారు. మంత్రి అమర్‌నాథ్ రెడ్డి చేతుల మీదుగా టీటీడీలోని వివిధ పథకాలకు రూ.3.50కోట్లు విలువ చేసే చెక్కులను శ్రీనివాస్ అందజేయగా, రవి రూ.10కోట్లు అందజేశారు. ఈరోజు ఉదయం దాతలు కుటుంబసభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments