వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో పర్యటిస్తోన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఎన్డీయేతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై మోదీ, అమిత్ షాలతో తాను మాట్లాడతానని వ్యాఖ్యానించారు.ఎన్డీఏ నుంచి వైదొలగడం చంద్రబాబు తొందరపాటు నిర్ణయమని, ఆయన ఎన్డీయేలో కొనసాగి ఉంటే హోదాపై మోదీ సానుకూలంగా స్పందించేవారని చెప్పారు. కాగా, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని రాహుల్ గాంధీ కాపాడుకోవాలని ఆయన అన్నారు.
ఆయన ఎన్డీఏలోకి వస్తే సీఎం చేస్తాం
Subscribe
Login
0 Comments