‘‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే నేను బతికానన్నా’’ అని ఊలపల్లికి చెందిన బాదిరెడ్డి శ్రీదేవి జగన్ను తెలిపింది. ‘‘తొమ్మిదో తరగతి చదువుతుండగా పాఠశాలలో పడిపోవడంతో చెవి వెనుక భాగంలో తీవ్రగాయమైందని, తల్లిదండ్రులు కాకినాడ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించినా చెవిలో నుంచి రక్తం చీము రూపంలో కారేదని, డాక్టర్లు తాను బతకనని చెప్పి, కుదిరితే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికితరలించాలని సూచించారని వివరించింది. ఆ సమయంలో వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం తనను ఆదుకుందని 2008లో రూ.1.80 లక్షలతో శస్త్ర చికిత్స చేయగా బతికానని తెలిపింది.
వైఎస్ వల్లే బతికానన్నా.
Subscribe
Login
0 Comments