ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిపోయారు. కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ ఆయనకు మువ్వన్నెల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ సిీనియర్ నేతలతో సమావేశమైన రాహుల్ తన నివాసానికి రాగా, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ కేంద్ర మంత్రి పళ్ళంరాజు, ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ ఉమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వచ్చారు. ఆపై కిరణ్ తో సమావేశమైన రాహుల్, నేతలంతా కలసి ఎన్నికల్లో విజయం దిశగా కలసి పనిచేయాలని సూచించారు. పార్టీలో సముచిత స్థానం ఇచ్చే విషయాన్ని తాను చూసుకుంటానని అన్నారు. కాగా, కిరణ్ పార్టీలో చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందని, విభజన సమయంలో పార్టీని వీడిన పలువురు నేతలు తిరిగి వెనక్కు తీసుకు రావచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ లోకి తిరిగి రావాలంటే రాహుల్ ఆహ్వానించాలని పళ్లంరాజుతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించగా, అదే విషయాన్ని రాహుల్ కు చేరవేసిన పళ్లంరాజు, ఆయనతోనే కిరణ్ ను ఆహ్వానించేలా చూశారని తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments