సమంత .. నాగచైతన్య పెళ్లి అయిన తరువాత మళ్లీ కలిసి నటించలేదు. ఈ జంటను మళ్లీ తెరపై చూడాలని అభిమానులు మాత్రం చాలా ఆశ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’  .. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాల్లో సమంతనే కథానాయికగా తీసుకోవాలని దర్శకులు ప్రయత్నించారు.

అయితే భార్యాభర్తలమైన తమకి ఆ కథలు సెట్ కావని చైతూ చెప్పాడట. ఈ నేపథ్యంలోనే చైతూకి దర్శకుడు శివ నిర్వాణ ఒక కథను వినిపించాడని తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య పరిణతి చెందిన ప్రేమ కథాంశంగా ఈ సినిమా రూపొందుతోంది. నిజ జీవితంలో మాదిరిగానే వీరిద్దరూ ఇందులో భార్యాభర్తలుగా కనిపించనుండటంతో ఈ కథకి చైతూ .. సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరి చేతిలో వున్న ప్రాజెక్టులు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments