గత కొద్ది కాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ జై సమైఖ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, పీసీసీ చీఫ్‌ రఘువీరాతో కలసి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. అనంతరం పార్టీలో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక ముఖ్యమంత్రిగా రోశయ్య పనిచేశారు. అయితే అప్పటి పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌ అధిస్టానం రోశయ్యను పదవి నుంచి తప్పించి స్పీకర్‌గా ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. అనంతరం తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మొగ్గు చూపడంతో, రాజీనామ చేసి స్వంతంగా జై సమైఖ్యాంధ్ర పార్టీ ని స్థాపించి 2014 ఎన్నికల బరిలోకి దిగారు.  అయితే ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో కిరణ్‌ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments