స్వామి పరిపూర్ణానంద శ్రీపీఠం చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు పరిపూర్ణానందను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకూ కాకినాడ శ్రీపీఠానికి చేర్చారు. వాస్తవానికి స్వామిని మధ్యాహ్నానికే కాకినాడకు తీసుకెళ్లాలి. అయితే మీడియా దృష్టి మరల్చేందుకు పోలీసులు స్వామీజీని ఆలస్యంగా కాకినాడకు తీసుకెళ్లారు. శ్రీరాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసనగా ధర్మాగ్రహ యాత్ర చేయాలనుకున్న స్వామీజీని హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ చేశారు.