నగర బహిష్కరణ ఎదుర్కొంటున్న శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద మళ్లీ హైదరాబాద్‌ వచ్చేందుకు సిద్ధమయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలలు హైదరాబాద్‌ నగర బహిష్కరణను పోలీసులు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన మళ్లీ హైదరాబాద్‌ వచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆయన టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్నారు. తనపై బహిష్కరణ హైదరాబాద్‌ పరిధి వరకే పరిమితం కావడంతో సైబరాబాద్‌ పరిధిలో ఉండేందుకు ఆయన హైదరాబాద్‌ వస్తున్నట్టు తెలిసిందే. ఈ విషయమై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోనూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ బయలుదేరినట్టు తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments