భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్.. థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండోసీడ్ సింధు 21-8, 21-15తో లిండా జెట్‌చిరి (బల్గేరియా)పై గెలిచింది. చీలమండ గాయం నుంచి కోలుకున్న తర్వాత రెండో టోర్నీ ఆడుతున్న తెలుగమ్మాయి ఈ మ్యాచ్‌లో మునుపటి ఫామ్‌ను చూపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 21-15, 21-17తో హు షు (కెనడా)పై నెగ్గగా, నాలుగోసీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్ 21-16, 21-19తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)ను ఓడించి ప్రిక్వార్టర్స్ బెర్త్‌ను దక్కించుకున్నారు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 18-21, 16-21తో సెన్‌సోమ్‌బున్సోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు. డబుల్స్‌లో మను అత్రి-సుమిత్ రెడ్డి 21-18, 15-21, 21-17తో చెన్ లింగ్-వాంగ్ చి లిన్ (చైనీస్‌తైపీ)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో వైష్ణవి రెడ్డి 13-21, 17-21తో సయాక సాటో (జపాన్) చేతిలో ఓడింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments