విజయ వాహిని స్టూడియోస్ అధినేతగా .. నిర్మాతగా బి. నాగిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలిగిన వ్యక్తిగా కనిపిస్తారు. కథ .. కథనాలు .. చిత్రీకరణ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ప్రతి సినిమాను ఆయన ఒక తపస్సులా భావించి పూర్తిచేసేవారు. అందువల్లనే విరామమెరుగని విజయాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి.ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలు కొన్ని ఈ బ్యానర్ నుంచి వచ్చాయి. ఎన్టీఆర్ అంటే నాగిరెడ్డికి ఎంత అభిమానమో .. ఆయనంటే ఎన్టీఆర్ కి అంతటి గౌరవం. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. అందువలన ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నాగిరెడ్డి పాత్రకు ప్రాధాన్యత వుంది. ఈ కారణంగానే ఈ పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ పాత్రతో ఈ సినిమాకి మరింత నిండుదనం వస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇక మరో దర్శక నిర్మాత బీఏ సుబ్బారావు పాత్రను సీనియర్ నరేశ్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
Subscribe
Login
0 Comments