దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తే దీ నుంచి లారీల నిరవధిక బంద్‌ చేపట్టనున్నట్లు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు తెలిపారు. బెంజి సర్కిల్‌లోని అసోసియేషన్‌ హాల్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల నాయకుల అత్యవసర సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన రవాణా రంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసాధారణంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని, గడువు ముగిసిన టోల్‌ఫ్లాజాలు నిలుపుదల చేసి, టోల్‌ విధానంలో పారదర్శకత తీసుకురావాలని, థర్డ్‌పార్టీ ప్రీమి యం పెంపును నిలుపుదల చేసి సమీక్షించాలని, జీఎస్టీ, ఇ-వేబిల్‌ వంటి తదితర సమస్యలను పరిష్కరించాని తీర్మానించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments