మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌తో మరోసారి భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో గురువారం జగన్‌తో తన భవిష్యత్‌ రాజకీయాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ఆనం’ వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం నేటి భేటీలో తేలిపోనుంది. వైసీపీలో చేరాలనే ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితం ఆనం రామనారాయణరెడ్డి హైదరాబాద్‌ విమానాశ్రయంలో జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే సమయాభావం కారణంగా ఆ రోజు అన్ని విషయాలు మాట్లాడుకునే వీలు లేకపోయింది. ఈ క్రమంలో ఏకాంతంగా మాట్లాడటానికి మరో అవకాశం ఇవ్వాలని రామనారాయణ రెడ్డి కోరిన క్రమంలో 12వ తేదీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆనం నేడు లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలవనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments