బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రేపు నగరానికి రానున్నారు. ఈ క్రమంలో అమిత్ పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. రేపు ఉదయం ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో అమిత్‌షా సమావేశమవుతారని చెప్పారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్, కోర్ కమిటీ, కార్యకర్తల సమావేశాలలో అమిత్ పాల్గొంటారని తెలిపారు. కార్యకర్తలకు అమిత్‌షా దిశానిర్ధేశం చేస్తారని ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments