సమంత ప్రధాన పాత్రగా ‘యూటర్న్’ సినిమా రూపొందుతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో ఆమె న్యూస్ రిపోర్టర్ గా కనిపించనుంది. రీసెంట్ గా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. త్వరలోనే పాటల చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి .. భూమిక కీలకమైన పాత్రలను పోషించారు.

శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి సాధ్యమైనంత త్వరగా ఫస్టులుక్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత నయనతార మాదిరిగా సమంత కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. సమంత పోషించిన ఈ పాత్ర .. ఈ సినిమా ఆమెకి ఏ స్థాయి గుర్తింపును తెచ్చిపెడతాయో చూడాలి మరి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments