ఫిఫా ప్రపంచకప్‌ సమరం తుది అంకానికి చేరుకుంటే.. కొద్దీ సేపు ఆ టోర్నీనే మరిచిపొమ్మంటున్నాడు.. టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. క్రికెట్‌ వీడ్కోలు అనంతరం ట్విటర్‌ వేదికగా కొత్త కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఢిల్లీ ఆటగాడు తనదైన సెటైరిక్‌ ట్వీట్స్‌తో ప్రతి విషయంపై స్పందిస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ప్రపంచమంతా ఫిఫా ఫీవర్‌తో ఊగిపోతుంటే.. దానికి సంబంధించే ఓ వీడియోను ట్వీట్‌ చేశాడు. ఈ వీడియోకు క్యాప్షన్‌గా.. ‘ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, ‍క్రొయేషియాలను మరిచిపోండి.. ఇతన్ని చూడండి’  అంటూ పేర్కొన్నాడు.

ఇక ఆ వీడియోలో ఏముందంటే.. ఓ పెద్దాయన కొట్టిన గోల్‌. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే అతను ఫుట్‌బాల్‌ మైదానంలో ఆ గోల్‌ సాధించలేదు. రోడ్డు పై నుంచి బంతిని నేరుగా ఓ ఇంటి కిటికీలో పంపించాడు. అయితే ఈ గోల్‌ అందరిని థ్రిల్‌ చేస్తోంది. దీంతో ఇది తెగ వైరల్‌ అయ్యింది. ఇక బెల్జియంతో జరిగిన సెమీ ఫైనల్లో ఫ్రాన్స్‌ 1-0 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments