యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘టాక్సీవాలా’ సిద్ధంగా వుంది. ఇక ‘గీత గోవిందం’ చిత్రీకరణను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తెలుగు .. తమిళ భాషల్లో ‘నోటా’ అనే సినిమా చేస్తున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
రాజకీయాల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందనే విషయం బయటికి వచ్చిన దగ్గర నుంచి, విజయ్ దేవరకొండ పాత్ర ఎలా వుండనుందా అనే ఆసక్తి అందరిలో పెరిగిపోతూ వస్తోంది. ఈ సినిమాలో ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇటీవల మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ‘భరత్ అనే నేను’ భారీ విజయాన్ని సాధించింది. అందువలన ‘నోటా’ కూడా విజయ్ దేవరకొండకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments