సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లపై మంత్రి లోకేష్ చేసిన ప్రకటనే ఫైనల్ అని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పరిస్థితులను బట్టి లోకేష్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించారని అన్నారు. అలాగే టీజీ వెంకటేష్, టీజీ భరత్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమంలో అభ్యర్థుల పేర్లను మంత్రి లోకేష్ ప్రకటించడం ఆశ్యర్యానికి గురిచేసిందని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. లోకేష్‌ను ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి హిప్నటైజ్ చేశారని ఎంపీ ఆరోపించిన విషయం తెలిసిందే.