బాబు పై అసభ్యకర వ్యఖ్యాలు చేసిన వైస్సార్సీపీ ఎంపీ

505

ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు తన నోటికి పనిచెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును నానా దుర్భాషలాడారు. ఆయనో దగుల్బాజీ అని, దుర్మార్గుడని, మతి భ్రమించిందని.. ఇలా తెలుగు భాషలో ఉన్న తిట్లన్నింటినీ ఉపయోగించారు. చంద్రబాబు మెదడు మోకాళ్లకు దిగిపోయిందని, సీఎం పదవిలో ఉండడానికి ఆయన అనర్హుడని విరుచుకుపడ్డారు. గవర్నర్, రాష్ట్రపతి వెంటనే ఆయనపై వేటు వేయాలని కోరారు. దేశాన్ని కొల్లగొట్టిన చంద్రబాబు జైలు కెళ్లడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన విజయసాయి ఏకదాటిగా చంద్రబాబును తిట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here