రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ మనోభావాలను గాయపరిచిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీస్ లు నగర బహిష్కరణ విధించారు. అనుమతి లేకుండా నగరం లో అడుగు పెట్టవద్దని ఆదేశించారు. దీనికి తోడు కత్తి మహేష్ ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్ లు ఏపీ పోలీస్ లకు అప్పగించినట్లు తెలుస్తుంది. కత్తి మహేష్ హైదరాబాద్ లో ఉంటె ఉద్రిక్తతలు మరీంత పెరిగే అవకాశం ఉందని కారణాలతోనే కత్తి మహేష్ పై బహిష్కరణ విధించారు. శ్రీ రాముడ్ని విమర్శించిన కత్తి మహేష్ పై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం లో పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది.

దేవుడంటే ఒక నమ్మకం ఒక భరోసా ఒక భక్తి వీటి పై విశ్వాసం లేని వారు దేవుడి పై మాట్లాడే అర్హత ఎక్కడిది శ్రీ రెడ్డి ఇష్యు వచ్చినప్పుడే నేను చెప్పాను.. రాజ్యాంగానికి వ్యతిరేకం గా మాట్లాడే శ్రీ రెడ్డి లాంటోళ్లను మీడియా కి రానివ్వద్దు అని ఆవిడకి తగిన శాస్తి చేసాం ఇప్పుడు ఎక్కడ కుడా ఆవిడా మీడియా లో కనిపించడం లేదు. నేను రంగం లోకి దిగేంతవరకే వీరి ఆటలు సాగుతాయి ఇక నేను కానీ ఫీల్డ్ లోకి వచ్చాను అంటే శ్రీ రెడ్డి కి పట్టిన గతే కత్తి మహేష్ కి పడుతుంది. అసలు కత్తిని ప్రాంతాల నుండి కాదు మీడియా నుండి కత్తికి తెర వెనకాల కొమ్మి కాస్తున్న మీడియా ఎవరిదో రెండు రాష్ట్రాల ప్రజల కు తెలుసు ముందు ఆ మీడియా సంస్థను బహిష్కరించాలి అంటూ పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్..

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments