సింగపూర్‌ పర్యటనకు సంబంధించి తనపై వచ్చిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సింగపూర్ పర్యటనపై కొంతమంది విమర్శలు చేస్తున్నారని, పారిశ్రామిక పెట్టుబడుల కోసమే సింగపూర్‌లో పర్యటించానని సీఎం వివరించారు. పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచామని తెలిపారు. అతిపెద్ద సంస్థ కియా మోటార్స్‌ ఏపీకి వచ్చిందని, జనవరిలో కియా మోటార్స్‌ మొదటికారు బయటకు వస్తుందని చెప్పారు. ఆటోమొబైల్‌ హబ్‌గా ఏపీని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments