హైదరాబాదులో గత రెండు రోజులగా జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉన్నాయని పరిపూర్ణానంద స్వామి అన్నారు. మన దేశంలో అన్ని కులాలు, మతాలకు సమాన గౌరవం, విలువలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు ఇతర మతాలు, కులాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని… ఇది చాలా అభ్యంతరకరమని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు రేగితే… సమాజం అల్లకల్లోలమవుతుందని చెప్పారు. రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘిస్తూ, ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న కొందరికి… బాబు గోగినేనిలాంటి వాళ్లు ఆదర్శంగా నిలుస్తున్నారని మండిపడ్డారు. దుర్మార్గపు భావజాలాన్ని కలిగి ఉన్న వ్యక్తి బాబు గోగినేని అని దుయ్యబట్టారు.