రోజర్ ఫెదరర్… సమకాలీన టెన్నిస్ ప్రపంచపు రారాజు. మైదానంలోనూ, మైదానం బయట తన అభిమానులను ఎప్పుడూ అలరిస్తుంటాడు. ఇక ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న వింబుల్డన్ మెగా టోర్నీలో దూసుకెళుతున్న ఫెదరర్, ఓ మ్యాచ్ లో క్రికెట్ షాట్ చూపించాడు. రికార్డు స్థాయిలో ఎనిమిది వింబుల్డన్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఫెదరర్, సోమవారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్ పోరులో ఫ్రాన్స్ కు చెందిన అడ్రియన్ మనారినోతో ఆడి, 6-0, 7-5, 6-4తో అలవోకగా గెలిచాడు. ఈ మ్యాచ్ లో క్రికెట్ లో కనిపించే ఫార్వార్డ్ డిఫెన్స్ షాట్ ను తన రాకెట్ తో ఆడి చూపించాడు ఫెదరర్. ఆ వీడియోను వింబుల్డన్ నిర్వాహకులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. ఈ క్రికెట్ షాట్ కు ఫెదరర్ కు ఎంత రేటింగ్ ఇస్తారని ఐసీసీని వింబుల్డన్ ప్రశ్నించింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments