ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి చేసిన ఘనత ఇందిరాగాంధీదేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కర్నూలు జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన బ్రాహ్మణకొట్కూరులో ఈ వ్యాఖ్యలు చేశారు. తడబడుతూ చేసిన ప్రసంగంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆనాడు ఫుల్‌ మెజార్టీ ఉన్నా అన్నగారిని దింపితే తెలుగు ప్రజలు గర్జించారని చెప్పారు. ఆ గర్జనను తట్టుకోలేక మళ్లీ మన అన్నగారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరాగాంధీదేనని పేర్కొన్నారు. వర్ధంతిని జయంతి అనడం, జయంతిని వర్ధంతి అనడం, అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉందనడం, సైకిల్‌ గుర్తుకు ఓటు వేస్తే మనల్ని మనమే ఉరి వేసుకున్నట్లు అనడం ఇంతకుముందు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments