తెలుగదేశం పార్టీపై, ఆ పార్టీ నేతలపై ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, ఆరోపణలు చేస్తుండటంపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ ని సూటిగా ప్రశ్నిస్తూ ఆయనకు గంటా ఓ లేఖ రాశారు. ‘కేంద్రంపై పవన్ ఎందుకు పోరాడటం లేదు?’ ‘విశాఖకు రైల్వేజోన్ విషయమై ఎందుకు ప్రశ్నించడంలేదు? అంటూ మొత్తం 25 ప్రశ్నలను పవన్ కు తన లేఖలో గంటా సంధించారు. ఈ సందర్భంగా విశాఖలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రం నుంచి సహకారం లేకపోయినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్న సీఎం చంద్రబాబుకు అభినందనలు చెప్పాల్సిందిపోయి ఆయన్ని విమర్శిస్తారా అంటూ పవన్ పై మండిపడ్డారు.‘ ‘కళ్లుండీ చూడలేని ఓ కబోదిలా’ పవన్ వ్యవహరిస్తున్నారని, అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments