జనసేన అధినేత పవన్‌కల్యాణ్, వైసీపీ అధినేత జగన్‌పై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పవన్, జగన్, కన్నా లక్ష్మీనారాయణ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు. పవన్‌కల్యాణ్ ఓ దొంగ అంటూ ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసిందేనన్నారు. ‘పీఆర్పీని ముంచి మంత్రిపదవి తీసుకున్న చరిత్ర మీది కాదా?’ అని నిలదీశారు. ప్రధాని మోదీ ముగ్గురు దొంగలతో కలిసి అధికారం కోసం ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రాష్ట్రానికి సైతాన్‌లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తాను రక్షించుకొనేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతిస్తే కన్నా లక్ష్మీనారాయణపై తాను పోటీ చేస్తానన్నారు. అలాగే జగన్‌పై మా కుమార్తె పోటీ చేస్తుందని జలీల్‌ఖాన్ చెప్పుకొచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments