ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డిని చాతుర్మాస దీక్ష పూజల్లో పాల్గొనాలని కరప గ్రామానికి చెందిన శారదాపీఠం ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్‌ చాగంటి సూరిబాబు ఆహ్వానించారు. సోమేశ్వరం లోని క్యాంపు ఆఫీసులో సోమవారం ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర సరస్వతి మహాస్వామి ఈ నెల 27న హృషీకేషిలో నిర్వహించే చాతుర్మాస దీక్ష పూజల్లో పాల్గొనాలని కోరినట్టు తెలిపారు. స్వామీజీ సూచనల మేరకు శారదా పీఠం ధర్మాధికారితో కలిసి పార్టీ అధినేతను కలిసినట్టు చెప్పారు. గతేడాది హృషికేషిలో స్వామీజీ నిర్వహించిన చాతుర్మాస దీక్ష పూజలలో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా జననేత గుర్తు చేశారని ఆయన చెప్పారు. ఆషాఢ మాసం పౌర్ణమి నుంచి భాద్రప్రద మాసం పౌర్ణమి వరకు స్వామీజీ చాతుర్మాస దీక్షలో ఉంటారని తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments