బ్రాహ్మణులు పట్ల దారుణంగా ప్రవర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆలిండియా నాయీ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే ఢిల్లీలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించింది. ఆలిండియా నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రవీందర్ రాణా మాట్లాడుతూ, చంద్రబాబు వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు క్షమాపణలు చెప్పలేదని… ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పకపోతే రానున్న ఎన్నికల్లో టీడీపీని బహిష్కరిస్తామని హెచ్చరించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments