మహారాష్ట్ర రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ సీజన్‌లో గడిచిన 24 గంటల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. రోడ్లు, రైల్వే పట్టాలపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలవడంతో.. అటు వాహనదారులకు, ఇటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంధురస్ట్ రోడ్ రైల్వేస్టేషన్ వద్ద గోడ కూలిపోయింది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. విమానాల రాకపోకలు కూడా ఆలస్యమవుతున్నాయి. గడిచిన 72 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments