ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే .. మరో వైపున హీరోగాను తనకి వచ్చిన అవకాశాలను శ్రీకాంత్ ఉపయోగించుకుంటున్నారు. హీరోగా ఆయన మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. సుధీర్ రాజు దర్శకత్వంలో కొలన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘కోతలరాయుడు’ టైటిల్ ను ఖరారు చేయగా, శ్రీకాంత్ సరసన డింపుల్ చోపడే .. నటాషా దోషి నటించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments