తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా వరంగల్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, నల్లగొండ, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, వచ్చే రెండు రోజుల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, మంచిర్యాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పేర్కొంది.
Subscribe
Login
0 Comments