ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవికే తమ పార్టీ భయపడలేదని, అటువంటిది జనసేన అంటూ వచ్చిన పవన్ కల్యాణ్ కు అసలు భయపడబోమని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న ఆయన, ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఆడుతున్న నాటకంలో జగన్, పవన్ లు పాత్రధారులు అయ్యారని ఆరోపించిన ఆయన, మోదీ సూచనల మేరకు ఏపీలో రాజకీయాలను మార్చాలని వారిద్దరూ భావిస్తున్నారని అన్నారు. ప్రజలు టీడీపీ పాలనపై సంతృప్తితో ఉన్నారని, మరోసారి అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని చెప్పారు.
జనసేన అంటూ వచ్చిన పవన్ ఏం చేస్తాడు ?
Subscribe
Login
0 Comments