రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. పలు అంశాలపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. నిన్న (ఆదివారం) అనేక అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో, సింగపూర్ మంత్రులతో సమావేశమయ్యారు. నవ్యాంధ్రలో ఉన్న అవకాశాలను వివరించారు. ‘మా రాష్ట్రానికి రండి’ అంటూ సీఎం చంద్రబాబు ప్రతినిధులను ఆహ్వానించారు.