తూర్పుగోదావరి జిల్లా పి . గన్నవరం నియోజికవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది . నియోజకవర్గంలోని చింతలపూడిలో ఉన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిని అక్కడి మహిళలు నిలదీశారు . పదేళ్లుగా రోడ్లు , డ్రైనేజీలు , మంచినీటి సదుపాయాలూ లేవని ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు . అయితే ఇలా మహిళలు నిలదీయడంతో ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగి మీరు ఓట్లేస్తేనే గెలిచామా అంటూ నోరు పారేసుకున్నారు . దీంతో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలపై ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments