అలా అన్నందుకే పవన్ పై వ్యతిరేకత …

812

జనసేన అధినేత పవన్ తన పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటిస్తూ తాను ప్రచారం చేయడం వల్లనే అశోక్ గజపతిరాజు గెలిచారని అన్న విషయం తెలిసినదే . ఈ విషయం పై ఇదివరకే పవన్ అనేక విమర్శల పాలయ్యారు . ఇప్పుడు తాజాగా ఈ విషయం పై మాజీ ఎంపీ సబ్బం హరీ స్పందించారు . ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ అశోక్ గజపతి రాజు పవన్ నుండి వల్లనే ఈరోజు పవర్ అనుభవిస్తున్నారు అనేది చాలా తప్పని , ఆయన 1983 నుండి 2014 వరకూ గెలుస్తూ వస్తున్నారని , అప్పుడు కూడా అశోక్ గజపతిరాజును పవనే గెలిపించారా? టీడీపీలో క్రమశిక్షణ గల సీనియర్ నేత అశోక్ గజపతిరాజు’ అని అన్నారు. ఈ రకమైన మాటల వల్లనే పవన్ పై ఉత్తరాంధ్ర లో వ్యతిరేకత ఏర్పడిందని సబ్బం హరి అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here