జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఎలాంటి కులాలకు ప్రాముఖ్యత ఉండదని స్పష్టం చేస్తున్నా పవన్ పార్టీలో కుల రాజకీయాలు జరుగుతున్నాయని ఇటీవల అనేక విమర్శలు వస్తున్నాయి . ఇప్పుడు ఈ విషయం పై పవన్ స్పందించారు . విశాఖపట్నం పోర్టు కళావాణి స్టేడియంలో పలువురు జనసేనలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కుల పార్టీ కాదని స్పష్టం చేశారు . టీడీపీ నాయకులు తనకు అనవసరంగా ఆపాదిస్తున్నారని అన్నారు . తనకు కుల పిచ్చి ఉండివుంటే కనుక 2014 ఎన్నికలలో తెలుగుదేశం కు ఎందుకు మద్దత్తు ఇస్తానని ప్రశ్నించారు . ఇన్నాళ్లు గుర్తుకురాని కులం తన విషయంలో ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలుగుదేశం నాయకులు చెప్పాలన్నారు .

చంద్రబాబు మరోసారి సీఎం చేయాలని ప్రజలను కోరుతున్నారని , ఇప్పుడు ఏమి చేశారని మళ్ళీ పదవి ఇవ్వాలని పవన్ ప్రశ్నించారు . 2014 ఎన్నికలలో స్వయంగా టీడీపీ నాయకులే తమకు మద్దత్తు ఇవ్వాలని ముందుకు రావడంతో తాను చంద్రబాబు ఇంటికి వెళ్లి మాట్లాడానని అన్నారు . అవినీతికి పాల్పడితే చొక్కా పట్టుకొని నిలదీస్తానని ఆనాడే చెప్పానని , ఇప్పుడు ఆ పనే చేస్తున్నానాని తెలిపారు . అధికారంలో ఉన్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు పిచ్చి వేషాలు వేస్తే చొక్కాలు పట్టుకొని వీధుల్లోకి లాక్కొని వస్తామని పవన్ హెచ్చరించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments