ప్రతినాయక పాత్రల ద్వారా మొదట మంచి పేరు సంపాదించుకొని తరువాత హీరోగా తిరుగులేని విజయాన్ని అందుకున్నారు గోపీచంద్ . కానీ లౌక్యం సినిమా తరువాత అనేక ప్రయత్నాలు చేసినా సరైన విజయం అందుకోలేకపోయారు . ఇప్పుడు ఆయన హీరోగా తాజాగా విడుదలైన సినిమా పంతం . యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా నిన్న విడుదలై మంచి కలెక్షన్స్ సంపాదించుకుంటోంది . ట్రైలర్ నుండే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా మొదటి రోజే దాదాపు 5కోట్ల షేర్‌ను, 3 కోట్ల గ్రాస్‌ను రాబట్టిందని సమాచారం . ఈ సినిమాలో గోపిచంద్‌ సరసన మెహ్రీన్‌ జోడిగా నటించారు. ఈ సినిమాకు గోపిసుందర్‌ సంగీతమందిచగా, కేకే రాధామోహన్‌ నిర్మించగా, కె చక్రవర్తి దర్శకత్వం వహించారు. మొదటి రోజు వసూళ్లను బట్టి చూస్తే చాలా కాలం నుండి విజయం కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు ఈ సినిమా ఒక ఊరట కల్పించిందనే చెప్పాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments