నిన్న మొన్నటి వరకు రొమాంటిక్ సినిమాలలో నటించి ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తున్నారు నాగార్జున , తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు నాని . వీరిద్దరి కలయికలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది . వైజయంతి మూవీస్ పతాకం పై అశ్వినీదుత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ చిత్రంలో నాగార్జున డాన్ గా , నాని డాక్టర్ గా కనిపించనున్నారు . అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో ను రెవీల్ చేసింది చిత్రబృందం . ఈ చిత్రానికి “దేవదాస్” టైటిల్ ను ఖరారు చేశారు . ఇప్పటివరకూ నాగ్ – నాని కాంబినేషన్ గురుంచి ఆసక్తిగా ప్రేక్షకులు ఉన్నారు . దేవదాస్ అనే పేరుకి తెలుగునాట ఒక చరిత్ర ఉంది . అటువంటి టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకులలో పెరుగుతోంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments