హైదరాబాదు లో ఘోర ప్రమాదం …

565

ఈ మధ్య హైదరాబాదులో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి . ఇటీవలే ట్రావెల్స్ బస్సులు షార్ట్ సర్క్యూట్ వాళ్ళ అగ్ని కి ఆహుతైన విషయం తెలిసినదే . ఇప్పుడు తాజాగా మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది . సినీ ప్రరిశ్రమకు చెందిన వారు ఎక్కువగా నివసించే కృష్ణా నగర్ లో గత అర్థరాత్రి 12 గంటలకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆడిటోరియం ప్రక్కనే ఉన్న నాలుగు అంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి . వసంత హార్డ్ వేర్ అండ్ పెయింట్స్ దుకాణంలో మంటలు వ్యాపించగా, విషయం తెలుసుకున్న అధికారులు ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు చాలాసేపు శ్రమించారు . స్టోర్ లో రసాయనాలు అధికంగా ఉండడంతో మంటలు అంత త్వరగా అదుపులోకి రాలేదు . ఈ ఘటనలో సుమారు రూ . 25 లక్షల మేర ఆస్తి నష్టం జారీ ఉండొచ్చని అంచనా . ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాధమిక నిర్ధారణ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here