గత సంవత్సర కాలంగా అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారారు ప్రముఖ సినీ విమర్శకులు కత్తి మహేష్ . ఇటీవల ఒక కార్యక్రమంలో కత్తి మహేష్ శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి అనేక మంది చేత విమర్శలపాలవుతున్న విషయం తెలిసినదే . అయితే తాజా మెగా బ్రదర్ నాగబాబు శ్రీరాముడిపై అనుచిత అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు . ఆ విషయం పై కత్తి మహేష్ ఒక వీడియో ద్వారా స్పందించారు . ఆయన స్పందిస్తూ తన పేరు చెప్పకుండా , తనను నీచుడిగా సంబోధించిన సంబోధించిన వీడియోను తాను చూశానని , దాన్ని చూసిన తరువాత తనకు జాలి కలిగిందని అన్నారు . తాను ఎందుకు నీచుడినో నాగబాబు చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు . పవన్ కు అన్నగా తప్ప , మరే విధమైన అస్థిత్వం లేని వ్యక్తి తన గురించి మాట్లాడుతున్నారని కత్తి మహేష్ అన్నారు .

ఒక అడుగు ముందుకు వేసి చిరంజీవి కుటుంభం పై అనేక విమర్శలు , ఆరోపణలు చేశారు . ప్రజలను మోసం చేస్తూ , సొంత పార్టీలను అమ్ముకొని వేరొక పార్టీలో చేరడం , జబర్దస్త్ లో కూర్చొని పిచ్చి నవ్వులు నవ్వడమే సమాజానికి మీరు చేస్తున్న సేవని మహేష్ నిప్ప్పులు చెరిగారు . మీ కుటుంబం, మీ సోదరుల గురించి తాను మాట్లాడితే తట్టుకోవడం కష్టమని నాగబాబును హెచ్చరిస్తూ, తాను చావడానికి సిద్ధమని, అయితే తనపై ఏదైనా చెయ్యి పడితే దానికి బాధ్యత మెగా ఫ్యామిలీ దేనని అన్నారు . ఇంకా మాట్లాడుతూ మెగా కుటుంబీకుల రాజకీయ సినీ జీవితాలు ఎంతటి దౌర్భాగ్యమో అందరికీ తెలిసే రోజు వస్తుందని , వారి పతనానికి వారే పునాదుకు తవ్వుకుంటున్నారని అన్నారు . ఒక దళితుడిని నీచుడని సంబోదించడంతో అతనికి ఎంతటి అహంకారమో అర్ధం చేసుకోవొచ్చని కత్తి మహేష్ నాగబాబు ఉద్దేశించి అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments