ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సాధన కోసం ఇప్పటికే జనసేన అధినేత పవన్ పర్యటిస్తున్న దాదాపు అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపడుతున్నారు . ఇప్పుడు నిరసన తెలపడానికి భారీ స్థాయిలో సిద్ధమయ్యింది జనసేన పార్టీ , ఏపీకి ప్రత్యేక హోదా , విభజన హామీలు అమలు కోసం రేపు విశాఖ సాగర తీరాన జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కవాతు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం తెలిపింది . పెద్ద ఎత్తున తరలివచ్చి కవాతులో పాల్గొనాలని ఆ పార్టీ కోరింది . ఈ కవాతు కాళీమాత గుడి నుంచి వైఎంసీఏ వరకు కొనసాగుతుందని తెలిపింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సముద్ర తీరాన ఈ కవాతు ప్రారంభంకానుందని పార్టీ వెల్లడించింది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments