మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ అరవింద సమేత’ . ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది . తాజా షెడ్యుల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను ఓ రేంజ్‌లో చిత్రీకరించారని టాక్‌. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొంత భాగాన్ని షూట్‌ చేయాలని చిత్ర బృందం నిర్ణయించిందని తెలుస్తోంది . అందుకోసం వరంగల్‌లోని భద్రకాళీ ఆలయ పరిసర ప్రాంతాల్ని పరిశీలిస్తున్నట్లు టాక్‌. చకచకా షూటింగ్‌ను పూర్తిచేసి దసరా కానుకగా సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు . ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌పోస్టర్స్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఆగస్టు 15న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments